News March 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

Similar News

News February 14, 2026

పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి దుర్మరణం

image

ఖమ్మం జిల్లా పాలేరు చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు APకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక జాలర్ల సాయంతో కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 14, 2026

సత్తుపల్లిలో.. ఆ భార్యాభర్తలు ఓడిగెలిచారు..!

image

సత్తుపల్లి ఆ భార్యాభర్తలు ఓడి.. గెలిచినట్లయ్యింది. మాజీ ఛైర్మన్ కూసంపూడి మహేష్ 14వ వార్డులో గెలవగా ఆయన సతీమణి మాధురి ఓడారు. అదేవిధంగా తాజాగా ఛైర్మన్ రేసులో ఉన్న రెహనాబేగం 22లో గెలవగా ఆమె భర్త కమల్ పాషా అపజయం పాలయ్యారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సత్తుపల్లి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానల్ 17 అభ్యర్థులతో హస్తగతం చేసుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఆరుగురు మాత్రమే గెలిచారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: ఖమ్మం సీపీ

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రస్తుతం BNSS 163 అమలులో ఉన్నందున.. విజయోత్సవ వేడుకలు, బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, డీజేల వాడకంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమించి గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని సీపీ కోరారు.