News March 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పది పరీక్షలు.
Similar News
News March 22, 2025
జూలూరుపాడు: ‘ఉపాధి కూలీలకు రూ.600 ఇవ్వాలి’

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం కింద రూ.600 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బానోతు ధర్మ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో ఉపాధి పని ప్రదేశాలను సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు మజ్జిగ, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News March 22, 2025
ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇలా..

ఖమ్మం జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొణిజర్ల(M) పెద్దగోపతి, ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు సత్తుపల్లిలో 38.7, కల్లూరులో 38.6, వైరాలో 38.5, ముదిగొండలో 38.5, పెనుబల్లి 38.4, కారేపల్లిలో 37.9, ఏన్కూరులో 37.3, రఘునాథపాలెంలో 37.2, బోనకల్‌లో 36.7, కుసుమంచిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.
News March 22, 2025
ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.