News March 29, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News March 31, 2025
KMM: రంజాన్ వేడుకల్లో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులకు భట్టి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News March 31, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
News March 31, 2025
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.