News March 30, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} మధిర మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు ∆} వేంసూర్ మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు.
Similar News
News February 19, 2026
మాతృ, శిశు మరణాల నివారణే లక్ష్యం: డీఎంహెచ్‌ఓ

జిల్లాలో హై రిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి, మాతృ, నవజాత శిశు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. గురువారం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ‘ఇంటిగ్రేటెడ్ హై-రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్’పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.
News February 19, 2026
ఖమ్మం: పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై సమీక్ష

ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై కేంద్ర బయోటెక్నాలజీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏక్తా విష్ణోయి సమీక్షించారు. గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి జిల్లాలోని 28 పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’, ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై అధికారులను అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 19, 2026
ఖమ్మం: రిటైర్మెంట్ బకాయిలు అందక విశ్రాంత ఏఆర్‌ఎస్‌ఐ మృతి

ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో 35 ఏళ్లు సేవలందించి 2025 ఫిబ్రవరిలో రిటైరైన ఏఆర్‌ఎస్‌ఐ కే.మైసయ్య కన్నుమూశారు. రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేక ఆయన మరణించడం విషాదం నింపింది. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేసింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.


