News April 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

Similar News

News April 6, 2025

భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.

News April 6, 2025

గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.

News April 6, 2025

మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులు, తలంబ్రాలు

image

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కాగా ముత్యాల తలంబ్రాలను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తీసుకువచ్చారు. దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.

error: Content is protected !!