News February 5, 2026

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 19, 2026

చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

image

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

News February 19, 2026

ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

image

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News February 19, 2026

సన్నబియ్యం పంపిణీలో పోర్టబిలిటీ తిప్పలు

image

ఖమ్మం జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టబిలిటీ సౌకర్యం కారణంగా ఇతర ప్రాంతాల వారు రావడంతో స్థానిక కార్డుదారులకు బియ్యం అందక డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకే ‘స్లాబ్’ విధానం అమలు చేస్తున్నామని అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇండెంట్ ప్రకారమే బియ్యం కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.