News June 19, 2024
ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ సర్వే వివరాలు
ఖమ్మం జిల్లాలో 2,46,683 ఇళ్లు ఉండగా వాటిని సర్వే చేస్తుంటే కొత్త గృహాలు లెక్కలోకి వస్తున్నాయి. కొత్త ఇళ్లను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సోమవారం వరకు జిల్లాలో 64,621 పాత ఇళ్లను సర్వే చేయగా మరో 78,302 కొత్త ఇళ్లు గుర్తించి వాటి వివరాలు పొందుపరిచారు. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా 1,82,062 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా కొత్త గృహాలను ఇంకెన్ని గుర్తిస్తారో తేలాల్సి ఉంది.
Similar News
News November 29, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.16,325 జెండా పాట పలకగా, క్వింటాలు పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.75 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
News November 29, 2024
REWIND: కేసీఆర్ అరెస్టు తర్వాత ఇదే జరిగింది..
2009 NOV 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్‌ను మొదట రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలనుకున్నారు. చివరకు ఖమ్మంకు తీసుకెళ్లారు. NOV 29 నుంచి DEC 2 వరకు ఖమ్మం జైలులో, ప్రభుత్వాసుపత్రిలో కేసీఆర్ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ఆదేశాలతో HYD తరలించారు.
News November 29, 2024
REWIND: మలిదశ ఉద్యమానికి పురుడుపోసిన ఖమ్మం గడ్డ!
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.