News August 10, 2024
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. ములకలపల్లి, వైరాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
Similar News
News January 10, 2026
KMM: 35,188 మంది విద్యార్థులు.. 66 పరీక్షా కేంద్రాలు

ఖమ్మం జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ థియరీ పరీక్షలకు 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సీసీలు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలన్నారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
News January 9, 2026
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.


