News April 15, 2025

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

image

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతోఅభ్యర్థులు చాలావరకు సమస్యలు ఎదుర్కొన్నారు.

Similar News

News April 16, 2025

2,019 మందికి రూ 20.19 కోట్లు జమ: పొంగులేటి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.లక్ష చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు.

News April 16, 2025

రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు.. కులాల వారీగా..!

image

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకానికి 91,850 దరఖాస్తులు  అందినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 29,091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14,220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41,881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6,658 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన ధరఖాస్తులన్నిటిని ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు.

News April 16, 2025

ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

image

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

error: Content is protected !!