News January 2, 2025

ఖమ్మం జిల్లాలో రేపు ఎంపీ పర్యటన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నట్లు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించే మున్నేరు కరకట్ట నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు. తదనంతరం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటిస్తారన్నారు.

Similar News

News January 5, 2025

చైనా మాంజా అమ్మొద్దు: సీపీ సునీల్ దత్

image

ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ఎస్‌హెచ్ఓలు తనిఖీలు చేపట్టి షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలు సైతం ఈ మాంజా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. 

News January 4, 2025

వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

News January 4, 2025

ఖమ్మం: చింతకానిలో గుర్తు తెలియని మృతదేహం

image

ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.