News July 9, 2024
ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 29, 2026
ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ల ఘటం: కలెక్టర్

ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు కీలక ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతీది సరిగ్గా ఉన్నాయో లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 29, 2026
ఖమ్మం ఇన్‌ఛార్జ్ డీఆర్‌డీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్

ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్ డీఆర్‌డీఓగా జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తన శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.
News January 29, 2026
డిగ్రీ పాత విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 2016 కంటే ముందు వార్షిక విధానంలో డిగ్రీ చదివి, సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బాణోతు రెడ్డి తెలిపారు. అభ్యర్థులు వర్సిటీ పరీక్షల విభాగం నుంచి ముందస్తు అనుమతి పొంది దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


