News August 3, 2024
ఖమ్మం జిల్లాలో సీడీపీఓల బదిలీ

ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన సీడీపీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రూరల్(M)(1)లో పనిచేస్తున్న శివమ్మ అదే మండలానికి, అటు ఖమ్మం రూరల్(M) (2) జయలక్ష్మి మణుగూరుకు, ఖమ్మం అర్బన్ కవిత మధిరకు, చండ్రుగొండ(M) నిర్మల జ్యోతి కల్లూరుకు, అశ్వారావుపేట(M) సరస్వతి తిరుమలాయపాలెంకు, బూర్గంపాడు(M) సలోమి చండ్రుగొండకు, తిరుమలాయపాలెం (M) కనకదుర్గ సత్తుపల్లికి బదిలీ అయ్యారు.
Similar News
News February 17, 2026
ఖమ్మం: పీఎం శ్రీలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: DEO

రాష్ట్రంలో పీఎం శ్రీ పాఠశాలల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని DEO చైతన్య జైని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో 28పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల మేరకు వినూత్న బోధన, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలని సూచించారు.
News February 17, 2026
ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
News February 17, 2026
ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.


