News September 11, 2024

ఖమ్మం జిల్లాలో 15వేల ఎకరాల్లో పంటనష్టం

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన సర్వే ఓ కొలిక్కి వస్తోంది. సర్వేలో భాగంగా 12,014 మంది రైతులకు చెందిన 15,058 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు మంగళవారం నాటికి గుర్తించారు. ఇందులో వరి 10,844 ఎకరాలు ఉంది. మధిర, కూసుమంచి మండలాల్లో సర్వే కొనసాగుతుండగా మరో రెండు, మూడు రోజుల్లో నష్టంపై స్పష్టత రానుంది.

Similar News

News October 6, 2024

దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: మంత్రి

image

ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అటువంటివి తాము చేయమన్నారు.

News October 5, 2024

రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి

image

రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.

News October 5, 2024

KTDM: సమాధి వద్దే సూసైడ్ అటెంప్ట్

image

ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్‌కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.