News July 7, 2024

ఖమ్మం జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం:కలెక్టర్

image

ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

ఖమ్మం: ప్రతి ఇంటికీ తపాలా ఖాతా.. కీలక ఆదేశాలు

image

ఖమ్మం: తపాలా శాఖ పొదుపు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా తపాలా సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఒక పొదుపు ఖాతా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లల కోసం ‘సుకన్య సమృద్ధి’ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సర్పంచుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో బీమా, డిపాజిట్లపై అవగాహన కల్పించి తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.

News February 15, 2026

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.

News February 14, 2026

పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి దుర్మరణం

image

ఖమ్మం జిల్లా పాలేరు చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు APకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక జాలర్ల సాయంతో కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.