News February 16, 2025
ఖమ్మం జిల్లాలో BRS PINK బుక్ ఫీవర్

BRS నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన వారి పేర్లు పింక్ బుక్‌లో రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించిన విషయం విదితమే. అయితే గత 10 రోజుల కింద ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ విషయమై తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు పింక్ డైరీలో రాస్తున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం, ఇటీవల కవిత మాటలతో పింక్ బుక్ హాట్ టాపిక్ అయింది.
Similar News
News March 12, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి GOOD NEWS

తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద సంక్షేమశాఖ, SC, ST, BC, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రూ.6వేల కోట్లతో ఈ పథకం రూపొందించామని డిప్యూటీ సీఎం చెప్పారు.
News March 12, 2025
ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మూల్యాంకనం నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో చురుగ్గా సాగుతోంది.మొదటి రోజు మొత్తం 24 మంది అధ్యాపకులకు 15 మంది హాజరై ఒక్కొక్కరు 30 పేపర్ల చొప్పున 450 సంస్కృతం సంస్కృతం మూల్యాంకనం నిర్వహించారు. మంగళవారం 24 మంది అధ్యాపకులకు 19 మంది హాజరై ఒక్కొ క్కరు 30 పేపర్ల చొప్పున 570 పేపర్లను మూల్యాంకనం చేయగా మొత్తం 1,020 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు.
News March 12, 2025
ఖమ్మం: పసుపు రైతుల సమస్యలపై మంత్రి సమీక్ష

పసుపు రైతుల సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలు దృష్టికి రావడంతో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, జిల్లా అధికారులతో మాట్లాడారు. పసుపు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలన్నారు. అలాగే రైతులు నష్టపోకుండా గరిష్ఠ ధర వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.