News February 16, 2025

ఖమ్మం జిల్లాలో BRS PINK బుక్ ఫీవర్

image

BRS నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన వారి పేర్లు పింక్ బుక్‌లో రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించిన విషయం విదితమే. అయితే గత 10 రోజుల కింద ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ విషయమై తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు పింక్ డైరీలో రాస్తున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం, ఇటీవల కవిత మాటలతో పింక్ బుక్ హాట్ టాపిక్‌ అయింది.

Similar News

News December 18, 2025

షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

image

‘శంబాల’ షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News December 18, 2025

చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిందని YCP చీఫ్ జగన్ పేర్కొన్నారు. ‘CBN గ్రాఫ్ పడిపోతోంది. దీనికి కలెక్టర్లే కారణమని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రైవేటీకరణే స్కామ్ కాగా సిబ్బందికి రెండేళ్ల పాటు జీతాలు GOVT ఇవ్వాలనుకోవడం మరో పెద్ద స్కామ్. వీటిపై కోర్టుకెళ్తాం. YCP అధికారంలోకి రాగానే వీటిని రద్దుచేస్తాం. బాధ్యులను 2 నెలల్లో జైల్లో పెడతాం’ అని హెచ్చరించారు.

News December 18, 2025

నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్

image

రాష్ట్రంలోని 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.