News December 22, 2025

ఖమ్మం జిల్లాలో Dy.Cm పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:35కు తల్లాడ (మం) పినపాకలో 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు సత్తుపల్లిలో సింగరేణి జీఎం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30కు జీవీఆర్ ఓపెన్ కాస్ట్ మెయిన్-2ను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

image

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్‌ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.

News December 24, 2025

ఖమ్మం: సర్పంచ్‌లకు ‘పంచాయతీ’ పాఠాలు

image

ఖమ్మం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా నుంచి ఎంపికైన 33 మంది అధికారులు శిక్షణ పొంది, అనంతరం సర్పంచ్‌లకు విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 24, 2025

ఖమ్మం గజగజ

image

ఖమ్మం జిల్లాలో ‘చలిపులి’ పంజా విసురుతోంది. గత పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులు,మున్సిపల్ కార్మికులు, పాలు,కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ధాటికి వృద్ధులు, పిల్లలు అల్లాడుతుండగా పొలాల వద్ద రైతులు చలిమంటలే శరణ్యమంటున్నారు. రానున్న 3రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.