News August 14, 2025
ఖమ్మం జిల్లా నేటి వార్తా సమాచారం

☆ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
☆ జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
☆ నేడు జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచన
☆ ఇవాళ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
☆ జిల్లావ్యాప్తంగా ఇవాళ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు
☆ భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
☆ ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News August 14, 2025
ఖమ్మం: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ కళాశాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ పూర్ణచందర్‌రావు ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్, లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఈ నెల 20లోపు చెల్లించాలని ఆయన సూచించారు.
News August 14, 2025
జేవీఆర్, కిష్టారం ఓసీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, ఓబీలు నిలిచినట్లు పీవోలు ప్రహ్లాద్, నరసింహారావు తెలిపారు. Jvr OCPలో 68 mm వర్షపాతం నమోదవగా.. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.20 లక్షల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి. అదేవిధంగా Kistaramఓసీలో 6 వేల టన్నుల బొగ్గోత్పత్తి, 30 వేల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి.
News August 14, 2025
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలో జరిగే పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు చెప్పారు. పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గురువారం పర్యటన ఖరారు కాగా తాత్కాలికంగా రద్దు చేశారు.