News August 24, 2025

ఖమ్మం: ‘జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం’

image

ఆగస్టు 26 లోపు మైనారిటీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి అరుణ కుమారి తెలిపారు. ఎంపీసీ/బైపీసీ గ్రూపులలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 91543 65017, 78931 16918 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Similar News

News August 24, 2025

నవరాత్రి ఉత్సవాల జాగ్రత్తలపై ఎస్పీ దిశానిర్దేశం

image

వేములవాడలోని పద్మనాయక కళ్యాణ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ముఖ్యఅతిథిగా హాజరై నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలు, ప్రజల రాకపోకలు, శబ్ద కాలుష్యం, అగ్నిప్రమాదాల వంటి అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News August 24, 2025

వడ మధ్యలో రంధ్రం ఎందుకో తెలుసా?

image

మినప వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేకుండా ఉడికిస్తే బయటి భాగం త్వరగా వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. రంధ్రం పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. వేడి నూనె వడ లోపలి భాగాలను సమానంగా తాకి ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అంతేకాదు రంధ్రం వల్ల వడ తక్కువ మోతాదులో నూనెను వాడుకుంటుంది. ఆకారం మారకుండా ఉంటుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా రంధ్రం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.

News August 24, 2025

HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.