News July 19, 2024
ఖమ్మం: జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి

జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
Similar News
News October 19, 2025
ఖమ్మం: సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 5 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5లోగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.
News October 18, 2025
డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
News October 18, 2025
ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన స.హ.చ కమిషనర్

ఖమ్మం కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ అనుదీప్‌ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్‌తో చర్చించారు.