News December 30, 2025

ఖమ్మం: తగ్గిన నేరాలు.. బాధితులకు రూ.7 కోట్లు వాపస్!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు భారీగా తగ్గాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషితో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కట్టడి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ.2.45 కోట్ల చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేయించామని, మరో రూ.1.5 కోట్లు హోల్డ్ చేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.

Similar News

News January 3, 2026

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
☆ సత్తుపల్లి (మం) రామానగరంలో నేడు రక్తదాన శిబిరం
☆ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ పక్రియ
☆ జిల్లాలో పర్యటించనున్న కలెక్టర్ అనుదీప్
☆ ఖమ్మంలో నేటి నుంచి టెట్ పరీక్షలు
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News January 3, 2026

KMM: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఆస్పత్రులు సీజ్: డీఎంహెచ్‌ఓ

image

ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామారావు హెచ్చరించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యతని, చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వైద్యులు, యజమానులు నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు.

News January 2, 2026

ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.