News April 19, 2024
ఖమ్మం: తగ్గిన మిర్చి, పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింట రూ.19500, పత్తి క్వింటా జండా పాట 7150 రూపాయలు ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి కంటే ఈరోజు భారీగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి 500, పత్తి 150 రూపాయలు తగ్గింది.
Similar News
News November 26, 2024
ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న జరిగే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 26, 2024
ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 26, 2024
ఇవాళ, రేపు ప్రజా విజయోత్సవాలు: జిల్లా కలెక్టర్
ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో, ఎల్లుండి ఖమ్మం రూరల్ మద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్ హాలులో జయ జయహే ప్రజా పాలన అనే కళాబృందం అలేఖ్య సారథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తమని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.