News July 3, 2024

ఖమ్మం: తలలో గుచ్చుకున్న పెన్ను.. చికిత్స సక్సెస్!

image

ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది. భద్రాచలానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు <<13550256>>తలలో పెన్ను గుచ్చుకొని <<>>కోమాలోకి వెళ్లింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు చిన్నారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, సుమారు 4 గంటల పాటు వైద్యులు శ్రమించి తలలో గుచ్చుకున్న పెన్నును విజయవంతంగా తీశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.

Similar News

News July 5, 2024

ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం 

image

ఖమ్మం రూరల్ మండలం‌ దానావాయిగూడెం వద్ద  రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.‌ ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

image

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.