News February 20, 2025
ఖమ్మం: తహశీల్దార్ ఆఫీస్ ఎదుట వృద్ధురాలి ఆవేదన

ఖమ్మం జిల్లా మధిర తహశీల్దార్ కార్యాలయం ఎదుట దెందుకూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కనకపూడి కరుణమ్మ(85) ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ‘ఆక్రమణకు గురైన నా స్థలామైనా ఇప్పించండి.. లేదా నేను చనిపోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అని రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆఫీస్ ముందు బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. తన స్థలం కోసం తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయానన్నారు. మల్లు నందిని అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు.
Similar News
News February 21, 2025
BREAKING: ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్‌లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్‌కు హాజరైన ఆమె హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.
News February 21, 2025
ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
News February 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

√ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
√ మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
√ కొనిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
√ అమ్మపాలెం లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
√ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
√ మధిరలో కొనసాగుతున్న కుల గణన సర్వే
√ ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు