News February 11, 2025

ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News November 12, 2025

కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో పెండింగ్‌లోని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టొద్దని గట్టిగా చెప్పారు.

News November 12, 2025

IPPB 309 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. Jr అసోసియేట్ పోస్టుకు 20-32 ఏళ్ల మధ్య , Asst.మేనేజర్ పోస్టుకు 20-35ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో సాధించిన మెరిట్/ఆన్‌లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 12, 2025

ఈ నెల 16న సింగరేణి ఆసుపత్రిలో మెడికల్‌ క్యాంప్‌

image

ఈ నెల 16న గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు సింగరేణి ఆర్జీ 1 జీఎం డీ.లలిత్‌ కుమార్‌ తెలిపారు. ఆర్జీ 1, 2, 3, ఏఏల్‌పీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, CPRMSE & CPRMSNE కార్డు కలిగిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 12 నుంచి సింగరేణి ఆసుపత్రిలో నమోదు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.