News January 27, 2025
ఖమ్మం: తెలంగాణ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వైష్ణవి రత్న

పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైష్ణవి రత్న జాతీయస్థాయి అండర్ 17 క్రికెట్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని ఓ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కెప్టెన్‌గా ఉన్న వైష్ణవి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానం పొందింది. తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ నరసింహమూర్తి ప్రకటించారు.
Similar News
News November 4, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
News November 4, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

నేడు కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని HYD IMD తెలిపింది.
News November 4, 2025
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. ఆ ప్రాంతంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శిస్తారు. తర్వాత అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


