News January 4, 2026

ఖమ్మం: దరఖాస్తుల ఆహ్వానం

image

రేవంత్ అన్న కా సహారా, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్ తెలిపారు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు.

Similar News

News February 20, 2026

ఖమ్మం: అడ్డగోలుగా అబార్షన్ కిట్స్ అమ్మకాలు..!

image

ఖమ్మం జిల్లాలో డాక్టర్ రిఫరెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని వాడుతున్న మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదిలో 50 వేల కిట్స్ అమ్ముడయ్యాయి. షెడ్యూల్-H కిందకి వచ్చే మీసో ప్రోస్టల్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దు. ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని DI అనిల్ తెలిపారు.

News February 20, 2026

ఖమ్మం: ఎస్సీ స్టడీ సర్కిల్ దరఖాస్తులకు 22 చివరి తేదీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు అందించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 22న ముగియనుందని డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణ కోసం మార్చి 1న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.