News September 15, 2024
ఖమ్మం: దేవాలయంలో ఉరి వేసుకొని యువకుడి మృతి

చింతకాని మండలం వందనంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ఉరి వేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. చింతకాని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు కొనిజర్ల మండలం అనంతారానికి చెందిన యువకుడని ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.
Similar News
News November 1, 2025
క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్

ఖమ్మం: మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా తప్పుడు ఫిగర్ను ఇవ్వకూడదని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు వివరించారు.
News November 1, 2025
ఖమ్మం జిల్లా ఆత్మ పీడీగా సరిత నియామకం

ఖమ్మం జిల్లా ఆత్మ (అగ్రికల్చర్ టెక్నికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ) ప్రాజెక్టు డైరెక్టర్ గానే కాక జిల్లా రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా బి.సరితను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో ఉన్న కె.అభిమన్యుడు ఉద్యోగ విరమణ చేయడంతో భద్రాద్రి జిల్లాలో పీడీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను నియమించారు. ఈమేరకు ఉద్యోగులు అభిమన్యుడు, సరితను సన్మానించారు.
News November 1, 2025
ఖమ్మం: పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

పీఎఫ్ఎంఎస్ నిధులు రూ.4 లక్షల పైగా దుర్వినియోగం చేసిన ఆరోపణలపై బోనకల్ మండలం రాపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటరమణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రావినూతల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆమె ప్రత్యేక అధికారులకు తెలియకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఎంపీవో విచారణ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా కలెక్టర్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


