News September 22, 2025
ఖమ్మం: నిరీక్షణలో 95,325 మంది నిరుద్యోగులు

నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం చేస్తోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 95,325 మంది లబ్ధిదారులు పథకం ఎప్పుడు అమలు చేస్తారో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి, పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.
Similar News
News September 22, 2025
HYD: 24 నుంచి దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దుర్గామాత మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసేవారు స్థానిక PSలో సమాచారం అందజేసి, అనంతరం ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇస్తే ఉచిత కరెంట్ అందేలా చర్యలు తీసుకుంటారని TGSPDCL AE నిఖిల్ తెలిపారు.

అన్ని నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు: మంత్రి లోకేశ్

AP: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 24నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలు, 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు తెస్తాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. మోడల్ లైబ్రరీలకు సంబంధించిన యాప్‌ను 100 రోజుల్లో ఆవిష్కరిస్తాం’ అని అసెంబ్లీలో అన్నారు.