News November 5, 2025
ఖమ్మం: నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోండి

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం వారి DEET APPను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. రిఫరల్ కోడ్:JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ APPలో దాదాపు 900 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 5, 2025
NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.
News November 5, 2025
వరంగల్: 95 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 95 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 53, సెంట్రల్ జోన్ పరిధిలో 18, వెస్ట్ జోన్ పరిధిలో 15 ఈస్ట్ జోన్ పరిధిలో 9 కేసులను పోలీసులు నమోదు చేశారు.
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.


