News August 21, 2025
ఖమ్మం: నిల్వ మిర్చి రైతులకు అనూహ్య లాభం

మిర్చి ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా క్వింటాకు రూ.14,500గా ఉన్న ధర బుధవారం రూ.15,300కు చేరింది. ఒకేరోజు క్వింటాకు రూ.800 పెరగడంతో నిల్వ ఉంచిన మిర్చి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది రూ.18 వేలకు పైగా పలికిన ధర ఏడాది రూ.10వేలకు పడిపోవడంతో ఆందోళన చెందగా ప్రస్తుతం రూ.15,300కు ధర పెరగడంతో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు.
Similar News
News August 21, 2025
నేపాల్ వాదనను ఖండించిన భారత్

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.
News August 21, 2025
పంజాగుట్ట నిమ్స్‌లో ప్రపంచ సుందరి

ప్రతష్ఠాత్మక నిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్‌లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.
News August 21, 2025
HYDలో సక్సెస్.. ఇక రాష్ట్రమంతటా!

మంత్రి సీతక్క బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలో చిన్నారులకు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే HYDలో 139 అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయగా హాజరు 30% పెరిగిందని వెల్లడించారు. అంగన్వాడీ నూతన భవనాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు. టిఫిన్‌తో పాటు 100ML పాలు, వారంలో ఓ రోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటబుల్ కిచిడీ అందిస్తారు.