News November 18, 2025
ఖమ్మం నుంచే కవిత వ్యూహం?.. రాజకీయాల్లో ఉత్కంఠ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు MLC కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైరా మాజీ MLA, దివంగత బాణోత్ మదన్ లాల్ నివాసంలో ఆమె బస చేయనుండటం ఈ చర్చకు తెర తీసింది. ఇటీవల మరణించిన మదన్ లాల్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన సతీమణి మంజుల వైరాలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. త్వరలో ఆమె జాగృతిలో చేరి, వైరా నుంచి పోటీ చేస్తారనే చర్చ ఖమ్మం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News November 18, 2025
అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దేశంలో పెరిగిన ‘గర్భనిరోధకం’

గర్భనిరోధక మాత్రల వాడకంలో US, చైనా తర్వాత భారత్ నిలిచింది. దేశంలో ఏటా 3.5 కోట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్(ECP) అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 12% మేర విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. వీటిని అధికంగా వాడితే ప్రమాదమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు కండోమ్‌ల అమ్మకాలు ఇండియాలో ఐదేళ్లలో 17% మేర తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.