News April 17, 2025
ఖమ్మం: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు

ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.
Similar News
News November 8, 2025
ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్‌ఛార్జి హల్చల్

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్‌ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్‌ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News November 8, 2025
ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
News November 8, 2025
ఖమ్మం: కోతులు, కుక్కలతో బేజారు

ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, మహిళలు గాయపడి ఆసత్రి పాలయ్యారని, రేబిస్ భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోకముందే వాటిని నియంత్రించాలని మండల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది.


