News January 15, 2026
ఖమ్మం: పంచాయతీల్లో పైరవీల హోరు !

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక రాజకీయ వేడిని పెంచింది. ప్రతి పంచాయతీలో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉండగా.. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దాతలకు ప్రాధాన్యం ఉంటుంది. వీరికి ఓటు హక్కు లేకున్నా వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్ దక్కుతుండటంతో ఆశావహులు పోటీ పడుతున్నారు. తమ అనుచరులకే అవకాశం దక్కేలా సర్పంచ్‌లు, ఎమ్మెల్యేల వద్ద నేతలు మంతనాలు సాగిస్తున్నారు.
Similar News
News February 15, 2026
ప్రెగ్నెన్సీలో సన్‌స్క్రీన్ వాడొచ్చా?

ప్రెగ్నెన్సీలో సన్‌స్క్రీన్ ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే రసాయనాలు లేని, సహజ పదార్థాలున్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సన్‌స్క్రీన్‌లో ఆక్సిబెంజోన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ఎండోక్రైన్ డిస్‌రప్టర్ అని పిలుస్తారు. ఇది గర్భిణీ స్త్రీలకు హాని చేస్తుంది. మినరల్/ఫిజికల్ సన్‌స్క్రీన్‌లో ఉండే జింక్ ఆక్సైడ్ కెమికల్స్ ఉన్న సన్‌స్క్రీన్‌ల కంటే సురక్షితమైనదని చెబుతున్నారు.
News February 15, 2026
NZB: యథావిధిగా ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.
News February 15, 2026
JGTL: పాపం.. కుటుంబసభ్యులే ఓటు వేయలేదు..!

జగిత్యాలలో మొత్తం 50 వార్డులు, 94,800 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 254 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే జగిత్యాల 4వ వార్డులో ఒక్కరికి, 28వ వార్డులో ఇద్దరికి, 47వ వార్డులో ఒక్కరికి ఇలా నలుగురికి కేవలం ఒక్క ఓటు చొప్పున మాత్రమే వచ్చాయి. ఐతే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఓటు వేయలేదు. ఇవే కాకుండా 3 ఓట్లు వచ్చిన వారు ముగ్గురు, ఒక్కరికి 4, మరో ఇద్దరికీ 5 ఓట్ల చొప్పున రావడం విశేషం.


