News December 11, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్‌ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.
News December 17, 2025
ఖమ్మం: వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్ సరళిని వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


