News August 18, 2025
ఖమ్మం: పంట.. వర్షం తంటా!

ఎడతెరిపి లేని వర్షాలతో రైతు అవస్థలు పాలవుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసి చేతికందే దశలో పంటలు వర్షాలకు నీటిపాలవుతున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా కొంత మేరకు పత్తి, వరి పంటలు జలమయం కాగా ప్రతి రోజు విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలు నేలవారటం తోపాటు కుళ్ళిపోతున్నాయి. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గ్రామాల్లో ఆ పరిస్థితి ఉందా..?
Similar News
News August 18, 2025
‘సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి’

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4,700 కు పైగా ప్రభుత్వ కనెక్షన్ లు ఉన్నాయనీ, 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు.
News August 18, 2025
సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. సమానత్వం, స్వాభిమానం కోసం 400 సంవత్సరాల క్రితమే గొంతెత్తిన మహనీయుడని పేర్కొన్నారు.
News August 18, 2025
ఖమ్మం: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నేటి నుంచి శిక్షణ

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత శిక్షణ ఉమ్మడి ఖమ్మం సహా 23 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది.