News December 28, 2024
ఖమ్మం: పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే: వీపీ గౌతమ్
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల సర్వే పరిశీలన యాప్ ద్వారా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర హౌజింగ్ ఎండి V.P గౌతమ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్(M) జలగంనగర్, ఖమ్మంలోని మోతి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. సర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.
Similar News
News December 28, 2024
రూ.40 లక్షలు విలువచేసే రత్నాంగి కవచాలు విరాళం
భద్రాద్రి రాములవారికి HYD వాస్తవ్యులు రూ.40 లక్షలు విలువ చేసే రత్నాంగి కవచాలను శనివారం విరాళంగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు. ఈ కవచాలల్లో 51 వేల రత్నాలు ఉన్నాయని ఈవో తెలిపారు. దాతలు పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.
News December 28, 2024
ఖమ్మం పొలిటికల్ రౌండప్ @2024
కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 2024 కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు 9 గెలిచి ఊపుమీదుండగా భట్టి, తుమ్మల, పొంగులేటికి మంత్రి పదవులు దక్కడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిందన్నారు. BRS నుంచి గెలిచిన తెల్లం కాంగ్రెస్‌లో చేరారని.. ఆ పార్టీ ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందన్నారు. BJP, CPI, CPM ఎదగాలని ప్రయత్నిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. COMMENT
News December 28, 2024
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వచ్చి మృతి
ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన <<14993247>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు వ్యక్తులు మల్లయ్య, వెంకటేశ్వర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. HYDలో ఉంటున్న మల్లయ్య ఉసిరికాయలపల్లిలో ఇందిరమ్మ సర్వే జరుగుతుండగా వివరాలు ఇచ్చేందుకు వచ్చాడు. సర్వే ముగిశాక ఇల్లందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు ఇల్లందు, ఖమ్మంలో చికిత్స పొందుతున్నారు.