News November 6, 2025
ఖమ్మం: పత్తి మిల్లుల నిరవధిక సమ్మె వాయిదా

తెలంగాణలోని కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దీంతో నవంబర్ 6న జరగాల్సిన నిరవధిక బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు టీజీ కాటన్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై కేంద్రానికి లేఖ పంపినట్లు తెలిపింది. 2, 3 రోజుల్లో 75% మిల్లులు ప్రారంభమవుతాయని CCI బ్రాంచ్ మేనేజర్లు చెప్పడంతో.. కొనుగోలు కేంద్రాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
ఎలక్షన్స్.. రూ.651 కోట్లు సీజ్: EC

బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలతోపాటు 6 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాలపై ఈసీ పటిష్ఠ నిఘా ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు రూ.651 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్, డబ్బు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. సాధారణ పౌరులకు వేధింపులు, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
News April 5, 2026
భాకరాపేట జల్లికట్టు వేడుకల్లో అపశ్రుతి

భాకరాపేట జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం వేడుకల్లో పశువులు ఒక్కసారిగా జనాలపైకి దూసుకురావడంతో రవిచంద్ర అనే వ్యక్తి మెడలోకి పశువు కొమ్ము దిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాసులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వేడుకలు మొదలవ్వకముందే జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
News April 5, 2026
NLG: ఏప్రిల్‌లోనే రూ. 8.50 కోట్ల పన్ను వసూలు!

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.


