News August 27, 2025

ఖమ్మం: పర్యావరణ హితం.. మట్టి గణపయ్య రూపం

image

సత్తుపల్లిలో పలు ఉత్సవ కమిటీలు పర్యావరణానికి విఘాతం కలిగించకుండా మట్టి గణపతులను ఏర్పాటు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. స్థానిక జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రసన్న గణపతి ఉత్సవ కమిటీ మనగుడి ప్రాంగణంలో 23 ఏళ్లుగా కోలకతా కళాకారులతో మట్టి గణపతిని తయారు చేయించి ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే వాసవి క్లబ్, ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోదండ రామాలయ ప్రాంగణంలో 14 ఏళ్లుగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.

Similar News

News August 27, 2025

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

image

భద్రాచలంసీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

News August 27, 2025

నిడిగొండలో చారిత్రక కాంతులు..!

image

జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ చారిత్రక, ఆధ్యాత్మిక చిహ్నాల సంపన్న గ్రామం. అనేక శిల్పాలు, శాసనాలు ఘనమైన వారసత్వ సంపద కలిగిన గ్రామం. ఈ గ్రామంలో నేటి వరకు 10 గణపతి మూర్తులను మనం దర్శించవచ్చు. మరికొన్ని దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ శిల్పాలు చక్కని రూప లావణ్యంతో, శిల్ప కళా విశేషాలతో కూడియున్నవి. ఇందులో రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, కాకతీయ అనంతర కాలంలోనివి. మన వారసత్వానికి ప్రతీకలు.

News August 27, 2025

JGTL: కరాటే పోటీల్లో మైనారిటీ కళాశాల విద్యార్థికి ‘GOLD’

image

జగిత్యాలలోని తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల(టీజీఎంఆర్జేసీ) విద్యార్థి ఎం.డీ.అయానుద్దిన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌- 2025లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో ఫైనల్స్‌లో ఆయన ఇరాక్‌ ఆటగాడిని ఓడించి అంతర్జాతీయ వేదికపై మన దేశఖ్యాతిని చాటాడు. స్వదేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన అయానుద్దిన్‌ను కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.