News December 6, 2025

ఖమ్మం: పల్లెల్లో ఎన్నికలు.. HYDలో ఉన్న ఓటర్లే కీలకం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బతుకుదెరువు కోసం HYDకు వలస వెళ్లిన పల్లె ఓటర్లే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా మారారు. దీంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్లోనే మకాం వేశారు. తమను గెలిపిస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. ఈ కీలక ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News April 8, 2026

4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశమంతటా ‘సర్’!

image

తుది దశ ఓటర్ల జాబితా సవరణ(సర్)ను 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. AP, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ట్రాలు, 5 UTల్లో ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు, 3 UTల్లో ‘సర్’ పూర్తయింది. అస్సాంలో స్పెషల్ రివిజన్ నిర్వహించారు. మొత్తం 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. తుది దశలో 39 కోట్ల మంది వివరాలు రివ్యూ చేయనున్నారు.

News April 8, 2026

ముంబై అంటే పూనకాలే..

image

IPLలో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు మంచి రికార్డు ఉంది. మొత్తం 9 ఇన్నింగ్సుల్లో 53 సగటుతో 373 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 187గా ఉండటం విశేషం. 2023, 24 సీజన్లలో రెండు సెంచరీలు బాదారు. నిన్న 11 ఓవర్ల మ్యాచులో 32 బంతుల్లోనే 77* రన్స్ చేసి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

News April 8, 2026

ప.గో: తినుబండారాల కోసం వెళ్లిన చిన్నారిపై అత్యాచారం

image

ఆచంట మండలంలో ఒక పంచాయతీ పరిధిలో ఆరేళ్ల బాలికపై కిరాణా షాపు యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. తినుబండారాల కోసం షాపునకు వెళ్లిన బాలికపై ఈ ఘోరానికి ఒడిగట్టాడు. ఐసీడీఎస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.