News July 6, 2025
ఖమ్మం: ‘పల్లె ప్రకృతి వనం’.. పట్టించుకోక అధ్వానం

తల్లాడ(M) కేశవాపురంలో పల్లె ప్రకృతి వనం అడవిని తలపిస్తుండటంతో చూపరులను ఆకర్షిస్తుంది. మొక్కలకు గతంలో నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి అడవిగా అవతరించి, చూడటానికి మినీ పార్కులా కనిపిస్తోంది. కానీ నేడు తాళాలు వేసి అధికారులు పట్టించుకోపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించి, వనాన్ని సుందరీకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News July 7, 2025
GNT: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.
News July 7, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్‌మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.