News December 6, 2025
ఖమ్మం: పాతికేళ్లుగా ఆ గ్రామపంచాయతీ ఏకగ్రీవమే.!

సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీలో గత పాతికేళ్లుగా ఎన్నికలు లేవు. గ్రామపంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు CPI ML ప్రజాపంథా సానుభూతిపరులే ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సొంత గ్రామం కావడం. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ CPIML ప్రజాపంథా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి సందీప్(35)తో పాటు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
Similar News
News December 6, 2025
తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 6, 2025
నాగర్‌కర్నూల్: ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’.. పోస్ట్ వైరల్

ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని ఇంటి యజమాని ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంబేడ్కర్ మనకు కత్తిని కాకుండా ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని, డబ్బుకు, మందుకు ఓటును అమ్ముకోవద్దని, మూర్ఖులవుతారో, రాజులవుతారో నిర్ణయం ప్రజల చేతిలోనే ఉందని ఆ ఫ్లెక్సీలో ప్రదర్శించారు.
News December 6, 2025
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్స్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)-చెన్నై ఎగ్మోర్(MS) (నం.07146,47) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 6.40 గంటలకు SCలో బయలుదేరే ఈ ట్రైన్ 7న అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 8 గంటలకు MS చేరుకుంటుందన్నారు, 7న మధ్యాహ్నం 12.30కి MSలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ, 8న తెల్లవారుజామున 3కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.


