News February 17, 2026

ఖమ్మం: పీఎం శ్రీలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: DEO

image

రాష్ట్రంలో పీఎం శ్రీ పాఠశాలల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని DEO చైతన్య జైని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో 28పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల మేరకు వినూత్న బోధన, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలని సూచించారు.

Similar News

News February 18, 2026

ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

image

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.

News February 18, 2026

ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

image

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.

News February 18, 2026

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

image

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.