News August 22, 2025

ఖమ్మం: పేరెంట్స్ మందలించారని యువకుడు SUICIDE

image

ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు భరత్(19) ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 17న పురుగు మందు తాగగా, వెంటనే కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News April 5, 2026

గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కన్ను? వారసుల కోసం రాజకీయాలు!

image

WGL మేయర్ స్థానం జనరల్ కావడంతో ఆ సీటపై అన్ని రాజకీయ పార్టీలు కన్ను వేశాయి. వచ్చే మే 7న పాలకవర్గం పదవి కాలం ముగుస్తుంది. దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న MLAలు, మాజీ MLAలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు మేయర్ సీటును తమ వారసులకు దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 66 వార్డుల్లో 34 వార్డుల్లో పట్టు సాధిస్తే మేయర్ కావొచ్చు. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.

News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

News April 5, 2026

పార్వతీపురం: ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు

image

గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.