News January 26, 2026

ఖమ్మం: పొత్తుల చిక్కుముడి.. పొంగులేటి వర్సెస్ సీపీఐ

image

ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం మంత్రి పొంగులేటి వ్యూహాలతో సెగలు పుట్టిస్తోంది. ఏదులాపురం, కొత్తగూడెంలో మెజార్టీ స్థానాలను దక్కించుకుని తన ఆధిపత్యాన్ని చాటాలని మంత్రి స్కెచ్ వేస్తున్నారు. కానీ ఇది మిత్రపక్షమైన CPIకి ఇబ్బందిగా మారింది. ఈ స్థానాల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని సీపీఐ నేతలు పట్టుబడుతున్నారు. మంత్రి మాత్రం పట్టు వీడకపోవడంతో పొత్తులు కుదురుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.

Similar News

News February 14, 2026

వరంగల్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలంటే ఇదేనేమో!

image

మున్సిపల్ ఎన్నికల్లో ఓరుగల్లు జిల్లాలో గమ్మత్తు ఫలితాలు కనిపించాయి. గులాబీ కంచుకోటను హస్తంతో పెకలించింది. 2020లో 9 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే BRS క్లీన్ స్వీప్ చేసింది. 200 వార్డులకు ఎన్నికలు జరిగితే 134 వార్డుల్లో BRS, 33 వార్డుల్లో కాంగ్రెస్, BJP 9, CPM 2 వార్డులను, ఇతరులు 14 గెలుపొందారు. 2026 ఎన్నికల్లో 140 కాంగ్రెస్, 88 BRS, 8 BJP, CPM 5, ఇతరులు 15 విజయం సాధించారు.

News February 14, 2026

నంది వాహనంపై కీసరకు శివయ్య ప్రయాణం

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తి నంది వాహనంపై కీసరకు వేంచేశారు. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం రాత్రి కీసరగుట్ట నుంచి పోలీసు బందోబస్తు నడుమ డప్పు చప్పుళ్లతో ముదిరాజ్ కులస్థులు తమ భుజాలపై హర హర మహాదేవ అంటూ..స్వామి వారిని కీసరగుట్ట నుంచి నడక దారిలో కీసరకు తీసుకువచ్చారు.

News February 14, 2026

ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు

image

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.