News December 28, 2024
ఖమ్మం పొలిటికల్ రౌండప్ @2024

కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 2024 కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు 9 గెలిచి ఊపుమీదుండగా భట్టి, తుమ్మల, పొంగులేటికి మంత్రి పదవులు దక్కడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిందన్నారు. BRS నుంచి గెలిచిన తెల్లం కాంగ్రెస్‌లో చేరారని.. ఆ పార్టీ ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందన్నారు. BJP, CPI, CPM ఎదగాలని ప్రయత్నిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. COMMENT
Similar News
News February 21, 2026
ఖమ్మం: ‘ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు’

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సార్వత్రిక పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్యజైని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆమె సూచించారు.
News February 21, 2026
ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి 15 మందికి పదోన్నతులు రావడంతో శాఖలో ఉత్సాహం నెలకొంది.
News February 21, 2026
ఖమ్మం: బోనస్ సొమ్ముపై బ్యాంకుల ‘హోల్డ్’

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.


