News February 1, 2026
ఖమ్మం: ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.
Similar News
News February 1, 2026
KMM: కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా పని చేయాలి: మంత్రి కొండా సురేఖ

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ సహజమని, అయితే వార్డుకు ఒకే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ప్రతి ఇంటి గడప తట్టి, కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News February 1, 2026
KMM: ఇసుక అక్రమ హవా.. నిమ్మకు నీరెత్తని యంత్రాంగం!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక ఖమ్మం నగరానికి తరలిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ముసుగులో చెక్ పోస్టుల నుంచే ఈ రవాణా సాగుతుండటం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
News February 1, 2026
KMM: దోపిడీ కేసు.. ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష

ఫేస్‌బుక్ మిత్రుడిపై దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న కేసులో ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన నరేష్, షేక్ అహ్మద్, వేణులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2020లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఫణీంద్ర అనే వ్యక్తిని కొట్టి వాహనం ఎత్తుకెళ్లినందుకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.


