News October 4, 2025
ఖమ్మం: ప్రేమ పేరుతో మోసం.. యువతి అనుమానాస్పద మృతి

ప్రేమ పేరిట మోసం చేశాడని 3నెలలుగా ప్రియుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఓ యువతి చనిపోయింది. స్థానికుల వివరాలు.. పాల్వంచ వాసి ప్రియాంక, గట్టు(M) చిన్నోనిపల్లి వాసి PC రఘుగౌడ్ 4ఏళ్లుగా ప్రేమించుకోగా, ఇటీవల తనను దూరం పెడుతుండటంతో రఘు ఇంటి వద్దే ఆమె నిరసనకు దిగింది. ఈ రోజు యువతి మృతిచెందటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతికి రఘు బంధువులే కారణమని యువతి తరఫువారు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 4, 2025
VZM: డ్వాక్రా బజారులో రూ.12 కోట్ల వ్యాపారం

ఈ ఏడాది విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేష స్పందన వస్తోందని డీఆర్డీఏ పధక సంచాలకులు శ్రీనివాస్ పాణి అన్నారు. శుక్రవారం డ్వాక్రా బజారును పరిశీలించారు. గత ఏడాది రూ.8కోట్ల అమ్మకాలు జరగగా, ఈ సారి రూ. 12 కోట్ల వరకు అమ్మకాలు సాగే అవకాశం ఉందన్నారు. ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళ సంఘాలు పాల్గొన్నాయన్నారు.
News October 4, 2025
WNP: ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు- కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని తెలిపారు.
News October 4, 2025
వెంకటాపూర్: 60 ఏళ్లుగా ఆ పార్టీ మద్దతుదారే సర్పంచ్..!

వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ పంచాయతీకీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో నేటి వరకు కాంగ్రెస్ మద్దతుదారే సర్పంచ్‌గా గెలుపొందడం విశేషం. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండటం, సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఒక సామాజిక వర్గం కీలకంగా వ్యవహరించడం కారణమని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం నువ్వా? నేనా? అన్నట్లు ఉంటుందని అంటున్నారు.