News February 28, 2025
ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.
Similar News
News December 31, 2025
KMM: పులిగుండాల ఎకో టూరిజం సఫారీ వాహనాలు ప్రారంభం

ప్రభుత్వంతో పాటు సమాజం కలిస్తేనే అడవుల సంరక్షణ బలపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. పులిగుండాల ఎకో టూరిజం వద్ద ఏర్పాటు చేసిన సఫారీ వాహనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యేతో కలిసి వాహనాలను ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
News December 31, 2025
ఒక్క క్లిక్‌తో వీధి దీపాలు.. ఖమ్మం కార్పొరేషన్ కొత్త ప్రయోగం

ఖమ్మం నగర పాలక సంస్థలో విద్యుత్ ఆదా, మెరుగైన సేవల కోసం కమిషనర్ అభిషేక్ ఆగస్త్య’CCMS’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని 26,842 వీధి దీపాలను మొబైల్ యాప్ లేదా కంప్యూటర్ ద్వారా నియంత్రించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇవి వాటంతట అవే ఆరిపోవడం, వెలగడం జరుగుతుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.40 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, మరమ్మతులను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుంది.
News December 31, 2025
ఖమ్మం: MRO, కార్యదర్శిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలపై పెనుబల్లి MRO శ్రీనివాస్ యాదవ్, చింతగూడెం సెక్రటరీ రవిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఈ వ్యవహారంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది.


