News July 10, 2025
ఖమ్మం: బాలిక గర్భవతి.. యువకుడిపై కేసు నమోదు

మైనర్ బాలికను గర్భవతి చేసిన యువకుడిపై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ జగదీష్ వివరాలు ప్రకారం.. బచ్చోడు తండాకు చెందిన ధరావత్ బాలు అనే యువకుడు ఓ మైనర్ బాలిక(16)ను నమ్మించి మోసం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుపగా వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News July 10, 2025
విమాన ప్రమాదంపై వైరలవుతున్న లేఖ ఫేక్: PIB

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అంటూ వైరలవుతున్న లేఖ ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఆ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేయలేదని పేర్కొంది. సరైన సమాచారాన్ని అధికార వర్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 34 మంది స్థానికులతో కలిపి 275 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
News July 10, 2025
అమరచింత: వివాహిత మృతి.. భర్త ఇంటిపై బంధువుల దాడి..!

అమరచింత మండలం నాగల్ కడుమూరు గ్రామానికి చెందిన వివాహిత పల్లవి ఈనెల 7న తమిళనాడు రాష్ట్రంలో అనుమానాస్పదంగా మృతి చెందింది. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పల్లవిని నాగల్ కడుమూరు గ్రామానికి చెందిన శివతో మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. మృతురాలికి 11 నెలల బాబు ఉన్నాడు. నేడు డెడ్ బాడీ గ్రామానికి చేరుకోగా మృతురాలి బంధువులు శివ కుటుంబ సభ్యులపై దాడి జరిగినట్లు సమాచారం.
News July 10, 2025
పూర్తి కాలం నేనే సీఎం: సిద్దరామయ్య

కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.